Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

ఆధ్యాత్మికవిద్యా పరీక్ష

/
/
/
72 Views

ఒక గురువుగారి వద్ద కొందరు శిష్యులు ఆధ్యాత్మికవిద్య నేర్చుకుంటున్నారు. వారి శిక్షణా కాలం పూర్తయింది. గురువుగారు పరీక్ష పెట్టారు. గురువుగారు తలా ఒక అరటిపండు ఇచ్చి ఎవరూ చూడకుండా ఆ పండు తినిరమ్మని పంపారు. శిష్యులంతా తలాఒకదారి వెళ్లారు. కొంతసేపు తర్వాత అందరూ తిరిగి వచ్చారు.

ఒక శిష్యుడు – తాను దూరంగా చెట్టు చాటున కూర్చుని తిన్నానన్నాడు.     ఒక శిష్యుడు – తాను గది తలుపులు వేసుకుని తిన్నానన్నాడు. ఇలా అందరూ ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా వారివారి పండు తిని వచ్చారు.

కానీ ఒక శిష్యుడు మాత్రం పండు తిరిగి తీసుకొచ్చాడు. గురువుగారి ఆజ్ఞ పాలించనందుకు అతను బాధగా గురువుగారితో ఎవరూ లేని చోటు తనకు కనపడలేదన్నాడు. అదేమిటంటే “నేను ఎక్కడికెళ్ళినా అక్కడ మనుషులులేకపోయినా దేవుడు ఉంటున్నాడు. దేవుడు సర్వాంతర్యామి కదా. ఆయన అన్ని వైపుల చూస్తుంటాడు” అన్నాడు.

గురువుగారు అతని ఆధ్యాత్మికతకు మెచ్చుకుని ఉత్తీర్ణుని చేసాడు.

నీతి:- దేవుడు సర్వాంతర్యామి

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *