Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

ఆశ్రయం

/
/
/
90 Views

శ్లో||   నీచాశ్రయో న కర్తవ్య: | కర్తవ్యో మహాదాశ్రయ:

ఈశాశ్రయో మహానాగ: | పప్రుచ్చ గరుడం సుఖమ్ ||

జీవితంలో ఎవరినైనా ఆశ్రయించవలసి వస్తే నీచుల్ని(అల్పుల్ని)  గాక మహాత్ముల నాశ్రయించాలి. నీచుని ఆశ్రయిస్తే తనెంత గోప్పవడయినా చివరకు నాశనం తప్పదు. దుర్యోధనుని ఆశ్రయించి కర్ణుడు ప్రాణాలే కోల్పోయాడు. మహాత్ముల నాశ్రయించిన సామాన్యులు కూడా తగిన మర్యాదననుభావిస్తారు. ఈశ్వరు నాశ్రయించిన పాము గరుడుని చూచి కుశలమడిగే స్థాయికెదిగింది.

వ్యాఖ్య: ఒకసారి విష్ణుమూర్తి కైలాసం వెళ్లి గరుడుని దిగి అక్కడ ఆసనంఫై ఆసీనుడైనాడు. శివకేశవులు వారిమాటలలో వారుండగా ఈశ్వరుని మెడలోని పాము ప్రక్కగా కూర్చున్న గరుడుని “కులాసాగా ఉన్నావా”? అని కుశలమడిగింది. గరుడుని చూస్తేనే ప్రాణభయంతో దాక్కొనే పాముకు అంత ధైర్యమేలా వచ్చిందంటే శివుని మెడలో ఉండటమే. అదే మహదాశ్రయం.

ఆఢ్యుడున్నపు డందరూ పూజ్యులే

లెక్క మీద సున్న లెక్కినట్లు

ఆఢ్యుడేగిన పిదపనందరపూజ్యులే

లెక్క లేక సున్న మిగిలినట్లు

ఒక గోప్పవాడున్నపుడు వాని ప్రక్కనున్న వారందరూ గొప్పగానే గౌరవించ బడతారు. ఆ గొప్పవాడు లేనపుడు వారినెవరూ లెక్క చేయరు. ఎలాగంటే ఒక అంకె ప్రక్కన ఉన్న సున్న లన్నింటికి విలువ పెరుగుతుంటుంది. ఆ అంకె లేకపోతే సున్నాలకు విలువే లేదు.

ఉదా: 1,00,000 ఇలా సున్నలు పెరిగిన కొద్దీ విలువ పెరుగుతుంది,

,00,000 ఆ అంకె లేకపోతే సున్నలకు విలువేది?

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *