Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

కోపము

/
/
/
86 Views

సోముడు అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. తన మాట నెగ్గకపోతే చాలా గోల చేసేవాడు. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు కోపం మంచిది కాదని చెప్పాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. వాళ్ళ నాన్న బాగా ఆలోచించి, ఒక గోడ చూపించి ఇలా చెప్పాడు. “నీకు కోపం వచ్చినపుడల్లా ఈ మేకులు ఒక్కటి చొప్పున ఈ గోడకు కొట్టు.” అని కొన్నిమేకులు ఇచ్చాడు.

కొన్నాళ్ళ తరువాత ఆయన కొడుకును పిల్చి గోడను చూసాడు. గోడకు చాలా మేకులు ఉన్నాయి. ఆ మేకులన్నీ తీసేయమన్నాడు. మేకులు తీసేసాడు సోముడు. మేకులు కొట్టిన రంధ్రాలు అలాగే ఉన్నాయి. తండ్రి చెప్పాడు “ఆ రంధ్రాల వల్ల గోడ అందం పోయి వికారంగా కనపడుతోంది కదా! నీకు కోపం వచ్చినపుడల్లా నీతో ఉన్నవారు నీ ప్రవర్తనకు నిన్నుకూడా ఇలాగే అసహ్యించుకుంటారు కదా!”

అపుడు సోముడు తాను కోపం తగ్గించుకుంటానని చెప్పి తరువాతి కాలంలో మంచివాడనిపించుకున్నాడు.

నీతి: కోపము కూడదు.

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *