శ్రీచక్రము నుంచి ఆవిర్భవించిన శ్రీమాత

/
/
/
257 Views

జగన్మాత శ్రీలలితాపరమేశ్వరిని భక్తులు అనేక విధములుగా కొలుస్తూవుంటారు. కొంతమంది లలితా రహస్య సహస్రనామ పారాయణ చేసి ఫలితములు పొందుతారు, మరికొందరు కుంకుమ పూజ చేసి తరిస్తుంటారు. విశేషంగా వసంత నవరాత్రులయందు, శరన్నవరాత్రులయందు శ్రీచక్రమునకు కుంకుమ అర్చనలు, నవావరణ అర్చనలు చేస్తూవుంటారు.

శ్రీచక్రము శ్రీమాత యొక్క శక్తికి ప్రతీక. శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన శ్రీలలితాపరమేశ్వరి బిందు రూపములో శ్రీచక్రమందు వసించును. శ్రీచక్రమునకు కుంకుమార్చన కాని, అభిషేకము కాని, నవావరణ అర్చన కాని, మరి ఏ అర్చన కాని చేయుట వలన, శ్రీచక్రాధిష్టాన దేవత అయిన శ్రీలలితాపరమేశ్వరి సాధకునికి తన అనుగ్రహ శక్తిని ప్రసాదించును. సాధకులు తదనుగ్రహ ప్రసాద శక్తిచే తమతమ సంకల్పములను సిద్ధింపచేసుకొంటారు.

శక్తి స్వరూపిణి మరియు శ్రీచక్రాధిష్టాన దేవతైయిన శ్రీలలితాపరమేశ్వరి కి, సాధకుడు సమర్పించు పత్ర, పుష్ప, ఫల తోయాదులను స్వీకరించి సాధకునకు శక్తిని ప్రసాదించుచున్నది. సాధకుడు కనుక అదే శక్తిని శ్రీమాతకు సమర్పించినచో స్వయముగా శ్రీమాతే శ్రీచక్రము నుండి బహిర్గతమై దర్శనమునిచ్చును.

ఈ ప్రక్రియ ద్వారా శ్రీచక్రము నుంచి ఆవిర్భవించిన శ్రీమాతను దర్శించండి

ఈ ప్రక్రియను Srichakra – A Linear Approximation to Nonlinear Reality అను ఆంగ్ల పుస్తకమున ప్రచురించబడినది

3 Comments

  1. Sri Matre Namaha.I want to know about Srichakra.Is there any book about Srichakra and it’s worship in Telugu language?

      • శ్రీదేవీ నిత్యార్చన నవరాత్రివిధి: – సాధన గ్రంధ మండలి, తెనలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

It is main inner container footer text