సంఖ్యామాతృక – సంఖ్యాక్షర సమన్వయము

/
/
/
144 Views

‘సంఖ్యామాతృక’ – అక్షరములకు అంకెలకు సామరస్యము తెలుపు ఒక పధ్ధతి. ఈ పద్ధతి ‘అక్షర దర్శనం’ నందు చెప్పబడినది.

సూత్రము: అకటాది నవ, పాది పంచ, యాద్యష్ట, సంకేతరూపసంఖ్యా |

అ నుండి ఔ వరకు, క నుండి ఝ వరకు, ట నుండి ధ వరకు ఉన్న అక్షరములను 1 నుండి 9 అంకెలకు సమన్వయము. ప నుండి మ వరకు ఉన్న అక్షరములను 1 నుండి 5 అంకెలకు, య నుండి హ వరకు ఉన్న అక్షరములను 1 నుండి 8 అంకెలకు సమన్వయము.


ఉదాహరణకు –
ఈ సూత్రము పూర్వమున గణితశాస్త్రము నందు వినియోగములో ఉన్నది.  గణితశాస్త్రములో ఈ విధముగా చెప్పబడినది – కాదినవ, టాదినవ, పాదిపంచ, యాద్యష్ట.

  1. ‘రామ’ శబ్దమునకు అంకెల సమన్వయము ర = 2, మ = 5; రామ అనగా 2+5=7.
  2. ‘సదాశివ’ శబ్దమునకు అంకెల సమన్వయము స = 7, ద = 8, శ = 5, వ = 4; సదాశివ అనగా 7+8+5+4=24

ఒక రహస్యం (ఇది రహస్యం అని తెలుసుకోవటం ‘శ్రీవిద్యేగా’ !)

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

ఈ శ్లోకమును ఒకమారు పఠించిన (విష్ణు) సహస్రనామములు పఠించిన ఫలితము వచ్చును అను నానుడి. బహుశ దాని అర్థం ర = 2, మ = 5; రామ = 2 x 5 = 10

‘రామ రామ రామేతి’ (మూడు రామ శబ్దములు) = 10 x 10 x 10 = 1000 సహస్రనామ తత్తుల్యం ఆయిఉండవచ్చు.

అయితే శబ్దము యొక్క అక్షర సంఖ్యలను కూడ వలెనా? లేక హెచ్చవెయవలెనా? దీనికి ఖచ్చితమైన వివరణ లేదు. బహుశ ఒక పదము లేక మంత్రమును జపము చేయుచున్నచో అక్షర సంఖ్యలను హెచ్చవేయవలెనేమో?

…………

దీని తదుపరి సంఖ్యామాతృకా పద్దతిని వినియోగించి ‘లలిత రహస్య సహస్రనామముల’ చైతన్య విలువలను గుణించు పద్దతిని ప్రచురించెదము.

1 Comments

  1. Thanks for the useful information given. We hope many more such useful things in the days to come.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

It is main inner container footer text