సంసార బంధాల స్ధితి

/
/
/
157 Views

శ్లో ॥ అర్థాః గృహే నివర్తంతే

శ్మాశానే మిత్ర బాంధవాః

సుకృతం దుష్కృతం చైవ

గచ్ఛంతి మను గచ్ఛతి ॥

లోకం వదలి పోయేటపుడు, సంపాదించిన ధనం ఇంటనే ఉండిపోతుంది. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు, చేసిన పుణ్యము  పాపము మాత్రం వెన్నంటి వస్తాయి.

ధనసంపాదనకు ‘మితి’ ఉండాలి. ధర్మ సంపాదన అయితే అది పరిమితంగానే వుంటుంది. అమితంగా  సంపాదించాలని అవినీతిగా ప్రవర్తిస్తే దానివల్ల ఉపయోగం లేదు. వారసులు తింటారు అనుకుంటే పోయేటపుడు వాళ్ళు స్మశానం దాకానేరాగలరు. ఆపైన జీవుని  వెంటవచ్చేది శరీరంతో తాను చేసిన సుకృత దుష్క్రుతాలే (మంచి చెడులే). అది ఎరిగి మానవుడు దారా సుత మిత్రబాంధవులు మీద మమకారాన్ని అదుపులో పెట్టుకోవాలి. సాధ్యమైనంతవరకు ధర్మబద్ధంగా సుకృత కర్మలు చేయాలి. తద్వారా రాబోయే జన్మ ఇంత కంటె ఉత్తమ జన్మ లభిస్తుంది. అధర్మంగా ప్రవర్తిస్తే ఇంత కంటె హీనజన్మ ప్రాప్తిస్తుంది. ఇప్పటి జన్మమే అందుకు  ఉదాహరణ.  ఈ జన్మలో మనంచూస్తున్నాం. ఒక తల్లికి దండ్రికి పుట్టినవారే ఒకడు సర్వవిధములా సుఖపడుతున్నాడు ఇంకొకడు కష్టపడుతున్నాడు. ఒకడు ధనవంతుడు, ఇంకొకడు బీదవాడు. కారణం క్రిందటి జన్మల కర్మ ఫలితాలే.

ఇక్కడ వాల్మీకి మహర్షి జీవితం మననీయం. వాల్మీకి పూర్వాశ్రమంలో రత్నాకరుడనబడేవాడు. ఇతని వృత్తి దారి దోపిడీలు. బాటసారులను పలు విధాలుగా కష్టపెట్టి దొంగతనాలు చేసి భార్యా పిల్లలను పొషించేవాడు.

ఒకనాడు నారదమహర్షి రత్నాకరునికి తటస్థపడ్దాడు. దోచుకోవచ్చిన రత్నాకరునికి, నారదుడు జ్ఞాన బోధ  చేయబోయాడు. అతను తన దారాసుతుల  పోషణకు దోచుకంటున్నానన్నాడు. ఇందువలన  పాపం మూటగట్టు కుంటున్నావు చనిపోయినతర్వాత నరకంలో కష్టాలతో హీనాతిహీనంగా దుఃఖిస్తావు అంటాడు నారదుడు. తాను భార్య పిల్లల కోసం యీ పని చేస్తున్నాను కాబట్టి వచ్చే పాపంలో వారు కూడా భాగం పంచుకుంటారు అని సమర్ధించుకున్నడు. రత్నాకరుడు ఇంటికి పోయి వాళ్ళనా విషయం అడిగిరమ్మన్నాడు నారదుఢు. అతని భార్య పిల్లలు, “సంపాదించి  మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, ఎలా సంపాదించినా మాకు సంబంధం లేదు, కాబట్టి పాప భాగం పంచుకోమన్నరు”. రత్నాకరునికి విరక్తికలిగింది.

అతనికి నారదుడు ‘రామ’ నామ మంత్రోపదేశం చేయబోతే అతను ‘రామ’ అనలేక పొయడు. నారదుడు ‘రామ’ ను త్రిప్పి ‘మరా’ అనిపించాడు. రత్నాకరుడు కూర్చుని ‘మరా మరా’  అంటూ జపించాడు. అది ‘రామ రామ’ అయింది. కొన్నేళ్ళ తర్వాత నారదఢు ఆదోవన పోతూ ‘రామ’ జపం విని చూస్తే ఒక పుట్టలోనుంచి ఆ నామం వస్తోంది. అతనిని లేపి వాల్మీకి (వల్మీకము అనగా పుట్ట, పుట్టలోనుంచి పుట్టాడు కాబట్టి వాల్మీకి) అని పిలిచాడు. ఆ వాల్మీకే ‘రామాయణం’ రచించిన ఆదికవి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

It is main inner container footer text