Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

శుభ సమయం ఎప్పుడు?

/
/
/
295 Views

మొన్న ఆదివారం (4/March/2018) అనంతపూర్లో ప్రో||నాగరాజా ను కలిసి జాతకాలను విశ్లేషణ చేస్తూన్న సందర్భములో, సోమవారం ముఖ్యమైన లేక కొత్త పనులు చేయటానికి అనకూలంగా వుండదని, ఎందుకంటే రాహు కాలం, గుళిక కాలం, యమ గండం, వర్జం, దుర్మూహుర్తం లను హోరతో అనుసంధానము చేసి చూసిన, సోమవారము నాడు శుభ సమయం చాలా తక్కువ అని తెలుసుకోవటం జరిగినది. అప్పుడు అనుకొన్న ఈ విషయము మీద విశ్లేషణ చేసి ఒక బ్లాగ్ వ్రాయాలి అని.

ముందుగా కొన్ని విషయాలు:

  1. రాహు కాలం, గుళిక కాలం, యమ గండం, వర్జం, దుర్మూహుర్తం ఇవి పగటి పూటే వుంటాయి.
  2. రాహు కాలం కానీ, గుళిక కాలం కానీ, యమ గండం కనీ లేక వర్జం షుమారుగా గంటన్నర సమయం వుంటాయి. మన విశ్లేషణకు అనుకూలంగా వీటిని రెండు ముహుర్తములగా (అనగా 96 నిమిషములగా) పరిగణిద్దాం.
  3. దుర్మూహుర్తం 48 నిముషాలు. కొన్ని వారాలలో దుర్మూహుర్తం రోజుకి రెండు సార్లు వస్తుంది.
  4. రాహు కాలం, గుళిక కాలం, యమ గండం, వర్జం, దుర్మూహుర్తం అన్నీ వారజనితము. అనగా వరాన్ని బట్టి సమయములు మారుతూ వుంటాయి.
  5. హోర అనగా 60 నిమిషములు. పగలు 12 హోరలు, రాత్రి 12 హోరలు.
  6. వీటిని సూర్యోదయ కాలం నుంచి గణించాలి.
  7. మన విశ్లేషణ పగటి సమయానికే (అంటే సూర్యోదయము నుంచి సూర్యాస్తమయం వరకు) మాత్రమే పరిమితి చేయుటమైనది.
  8. రాహు కాలం, గుళిక కాలం, యమ గండం, వర్జం, దుర్మూహుర్తం గురించి పెద్ద ఆలోచన అక్కర్లేదు, సాంప్రదాయమైన కాలెండర్లో యివనీ వుంటాయి.
  9. మన విశ్లేషణకు ఈ క్రింది విషయాలను పరిగణలోకి తీసుకుందాము.
    1. వారము: సోమవారము
    2. సూర్యోదయ సమయం: 6:00 గంటలు

సోమవారం వారజనిత దోషసమయములు

రాహు కాలం: ఉ. 7-30 నుంచి 9-00
గుళిక కాలం: మ. 1-30 నుంచి 3-00
యమ గండం: ఉ.10-30 నుంచి 12-00
వర్జం: ఉ.5-12 నుంచి 6-48
దుర్మూహుర్తం: ఉ. 11-48 నుంచి 12-36

మ. 15-12 నుంచి 16-00

ప్రక్కన ఉన్న పట్టికలో వారజనిత దోషసమయములను హోర సమయములని కలిపి చూపించుట జరిగినది. సహజముగా రవి, కుజ, శని హోరలలో ముఖ్యమైన లేక కొత్త పనులు మొదలుపెట్టరు. అట్లాగే వారజనిత దోషసమయములలో ముఖ్యమైన లేక కొత్త పనులు మొదలుపెట్టరు.

సోమవారము నాడు ఈ రెండు సమయములను వదిలిపెట్టిన, పోగటి సమయమున మద్యహ్నం షుమారుగా 1-00 నుంచి 1-30 వరకే శుభ సమయము.

ఈ విధముగా అన్ని వారములకు విశ్లేషణ చేసికొని, శుభ సమయములు తెలుసుకొని, శుభ కార్యములు లేక నూతన కార్యములు చేపట్టవచ్చు.

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *