Author: Burra Harisankara Sastri

Burra Sastri, an amateur researcher and critical thinker of Telugu literature. His passion for Telugu literature and desire to pass this legacy to GenNext resulted in writing short stories, essays, articles, critical reviews etc. Same is presented through this blog.
img
శ్లో ॥ అర్థాః గృహే నివర్తంతే శ్మాశానే మిత్ర బాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతి మను గచ్ఛతి ॥ లోకం వదలి పోయేటపుడు, సంపాదించిన ధనం ఇంటనే ఉండిపోతుంది. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు, చేసిన పుణ్యము  పాపము మాత్రం వెన్నంటి వస్తాయి. ధనసంపాదనకు ‘మితి’ ఉండాలి. ధర్మ సంపాదన అయితే అది పరిమితంగానే వుంటుంది. అమితంగా  సంపాదించాలని అవినీతిగా ప్రవర్తిస్తే దానివల్ల ఉపయోగం లేదు. వారసులు తింటారు అనుకుంటే పోయేటపుడు వాళ్ళు స్మశానం దాకానేరాగలరు. ఆపైన […]
img
మృత సంజీవని విద్య శుక్రుడు దానవులకు గురువు. ఇతడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భ్రుగువు యొక్క కుమారుడు. శుక్రుడు- బృహస్పతి, బృహస్పతి తండ్రి యైన అంగిరసుని వద్ద విద్య నభ్యసించిరి. అంగిరసుడు శిష్యులిద్దరిలో వ్యత్యాసము చూపుటవలన శుక్రుడు, గౌతముని కడకేగి తనకు విద్య నేర్పవేడెను. గౌతముడు లోకమంతకు గురువగు శివుని అరాధించమనెను. శుక్రుడు గౌతమీ తీరమున శివుని ధ్యానించెను. శివుడు ప్రత్యక్షమై ‘మృతసంజీవని’ విద్య నేర్పెను. దేవతలు బృహస్పతిని, దానవులు శుక్రుని తమ గురువులుగా స్వీకరించిరి. అంధకాసురునితో […]
img
అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః ॥ శాస్త్రాలెన్నో ఉన్నాయి, తెలియవలసినదెంతో ఉన్నది, కాలం చూద్దామా పరిమితం. అడ్దంకులా అనేకం. అల్పశ్చ కాలః । బహవో విద్యాః ॥ కాలమా తక్కువ, చదవ వలసినది (తెలుసుకోవలసింది) చాలా ఉన్నది. శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇంకా ఆధునిక విజ్ఞానం తెలుసుకోవలసింది సముద్రమంత.  కాలం చూద్దామా అత్యల్పం. మహా అయితే 100 సం॥ లు. ఒక జీవిత కాలం చాలదు. అయినా చాలామంది నిర్లక్ష్యంగా కాలాన్ని వృధా చేస్తారు. ముఖ్యముగా పెద్దలు పురాణేతిహాసాలు, […]
img
కం ॥  ఒరులేయవి  యోనరించిన నరవర యప్రియము తన మనంబున కగు, దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్ ॥ శ్రీ మదాంధ్ర మహా భారతం లో, శాంతి పర్వం లో భీష్ముడు ధర్మజునికి చెప్పిన పరమ ధర్మమిది. (తిక్కన గారి గంటం ద్వారా ఉబికిన తెనియలధార ఇది). “ఇంకొకరు తనకు ఏమిచేస్తే తనమనసుకు కష్టం కలుగుతుందో, తాను ఇంకొకరికి అవి చేయకుండా వుండటం ధర్మాలలోకెల్ల గొప్ప ధర్మం”. ప్రతి మనిషి తన జీవితంలో […]
It is main inner container footer text