మనస్సు లగ్నం చేయటము అంటే ఏమిటి?

/
/
/
287 Views
Lagna and concentration of mind
Lagna and concentration of mind

చిన్నపుడు నాకు బాగా గుర్తు, చదువుకొనే రోజులో పాఠం అర్థం కాకపోతే, మనస్సు లగ్నం చేసి చదువు అని మా మామ్మ చెపుతూవుండేది. పెద్దావిడ చెప్పింది వినటమే గాని, ఎప్పుడు ఎదురు ప్రశ్నవేసింది లేదు, అది ఏమిటి అని ఆడిగింది లేదు. ఇలాంటి సంఘటన మీ ఇంటిలో కూడా జరిగి ఉండవచ్చు.

అసలు ‘మనస్సు లగ్నం చేయటం’ అంటే ఏమిటి? ఇందులో రెండు ఉన్నాయి. 1. మనస్సు, 2. లగ్నం.

జ్యోతిష్యం గురించి కొద్దో గొప్పో తెలిసినవారు ‘లగ్నం’ అన్న పదం వినివుంటారు.  ఇక జ్యోతిషం పై అవగాహన ఉన్నవారికి లగ్నం గురించి వేరుగా చెప్పనక్కరలేదు. లగ్నం అంటే కాలము మరియు అవకాశముల (time and space phenomenon) విషయము. లగ్నమనగా భూమి చుట్టూ పరిభ్రమిస్తునట్టున్న సూర్యుని కక్ష (apparent path)  మరియు భూమి యొక్క దిగ్మండలముల (horizon) సంధి.

లగ్నం సూర్యోదయమున సూర్యునితో కూడియుండి, వేగముగా 360 డిగ్రీల రాశి చక్రమును 24 గంటలలో చుట్టి మరుసటి రోజు సూర్యోదయమునకు సూర్యని చేరుతుంది. మనకి తెలుసు కదా! ఒక డిగ్రీ అనగా 60 నిమిషములు. 360 డిగ్రీలు అనగా 360×60=21,600 నిమిషములు. ఇది ఇలాఉంచి, మనస్సు గురించి తెలుసుకొందాము.

మనస్సుకు అనేకమైన నిర్వచనములు ఉన్నాయి. అందులో ఒకటి, మనస్సు అంటే ఆలోచన లేక సంకల్పము, ఆలోచన అంటే శ్వాసేగా!

ఒక సాధారణ వ్యక్తి రోజుకి 21,600 శ్వాసలు తీసుకొంటాడు. దీని గురించి యోగాభ్యాస్యములోను, ఆధ్యాత్మ రామయణము లోను, వివరించబడినది. అవి ఎలాగంటే.

  1. మూలాధార చక్రంలో 600 శ్వాసలు
  2. స్వాధిష్ఠాణ చక్రంలో 6000 శ్వాసలు
  3. మణిపూరక చక్రంలో 6000 శ్వాసలు
  4. అనాహత చక్రంలో 6000 శ్వాసలు
  5. విసుద్ధి చక్రంలో 1000 శ్వాసలు
  6. ఆజ్ఞా చక్రంలో 1000 శ్వాసలు
  7. సహస్రార చక్రంలో 1000 శ్వాసలు

ఇక్కడ ఉన్న ‘మనస్సు’ పైన చెప్పబడిన ‘లగ్నం’ ఒక్కటే! రెండు 21,600 కొలమానము లేదా పరిమాణము కలిగి ఉన్నాయి.

అండాండములో (macro cosom) ‘లగ్నము’ పిండాండములో (micro cosom) ‘శ్వాస’. శ్వాస పై ధ్యానము చేయటమన్నా లేదా మనస్సు లగ్నం చేయటమన్నా ఒకటే, అదే యోగాభ్యాసము, అదే జీవన్ముక్తి కి మొదటి సోపానము.

ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక సాధనా విషయము మన పెద్దలు సులువుగా గుర్తు వుండెందుకు ‘మనస్సు లగ్నం చేయి’ అని చెప్పారు.

ఇలాంటి బ్లాగు వ్రాయాలంటే ‘మనస్సు లగ్నం’ చేయాలిగా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

It is main inner container footer text