Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

శ్రీ లలిత సహస్రనామముల కూర్పు

/
/
/
430 Views

మొన్నీమధ్య గరికపాటి నరసింహారావు గారి ‘లలిత సహస్ర నామములు – సృష్టి రహస్యం’ అనే ప్రసంగం youtube లో వినటం జరిగినది. అందులో ఒక విషయం నాకు బాగా నచ్చింది. అదే ‘లలిత సహస్రనామాల కూర్పు’. దీని గురంచి శ్రీభాస్కరరాయ భారతి వారు తమ శ్రీలలితా సహస్రనామ భాష్యములో వివరించారు.

ఈ విషయాన్నితెలుసుకోవటానికి పూర్వము సంఖ్యామాతృక గురించి తెలుసుకుంటే బావుంటుంది. ‘సంఖ్యామాతృక’ – అక్షరములకు అంకెలకు సామరస్యము తెలుపు ఒక పధ్ధతి.

ఇక లలిత సహస్రనామాల కూర్పు గురంచి శ్రీభాస్కరరాయలు వారు చెప్పిన శ్లోకమును పరిశీలిద్దాం. ఈ శ్లోకమును కొంత సంకేతార్థముతోనూ కొంత సంఖ్యామాతృకతోను అర్థం చేసుకోవాలి.

శ్లో||   త్రిపురాం కులనిధిమీడేఽ రుణశ్రియం కామరాజవిద్ధాంగీం
త్రిగుణై ర్దేవై ర్వినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం

సంకేతార్థము మరియు సంఖ్యామాతృక అనుసరించి ఈ శ్లోకము యొక్క అర్ధం తెలుసుకుందాము. ఒక rule గుర్తు పెట్టుకోవాలి. ‘అంకానాం వామతో గతిహి’. counting is from left నుంచి right.

  1. త్రిపురాం – ‘ప’ అనగా 1, ‘ర’ అనగా 2. ‘త్రి’ శబ్దముతో మొదల్యై నామాలు 21
  2. కులనిధి – నిధి అనగా 9 (నవనిధులు). ‘కుల’ శబ్దముతో మొదల్యై నామాలు 9
  3. అరుణశ్రియం – అరుణ అనగా సూర్యుడు, 12 కు సంకేతము. ‘శ్రీ’ శబ్దముతో మొదల్యై నామాలు 12
  4. కామరాజ – రాజ అనగా 16. ‘కామ’ శబ్దముతో మొదల్యై నామాలు 16
  5. విద్ధాంగీం – ‘వి’ తో ప్రారంభించు నామములు 39. ‘ధ’ అనగా 9, ‘గ’ అనగా 3.
  6. త్రిగుణై – ‘గుణ’ శబ్దముతో ప్రారంభించు నామము  మూడు
  7. నినుతాం – నికార శబ్దాది నామములు 60. ‘న’ అనగా 0, ‘త’ అనగా 6. ‘నుతాం’ అనగా 60
  8. ఏకాంతాం – ‘త౦’ అను శబ్దముతో ప్రారంభించు నామము ఒకటి
  9. బిందుగాం – ‘గ’ అనగా 3. ‘బిందు’ శబ్దముతో మొదలయ్యే నామాలు 3
  10. మహారంభాం – ‘ర’ అనగా 2, ‘భ’ అనగా 4. ‘అంకానాం వామతో గతిహి’ అనుసరించి ‘రంభాం’ అంటే 42. ‘మహా’ శబ్దముతో మొదలయ్యే నామాలు 42
శబ్దము నామాల సంఖ్యా ఉదాహరణకు కొన్ని నామములు
త్రి 21 త్రిపురామ్బికా, త్రిపురశ్రీవశంకరీ, త్రిపురేశీ, త్రిమూర్తిః
కుల 09 కులకుణ్దాలయా, కులసంకేతపాలినీ, కులాంగనా
శ్రీ 12 శ్రీమాతా, శ్రీకంఠార్థ శారీరిణీ, శ్రీకరీ, శ్రీచక్రరాజనిలయా
కామ 16 కామకళారూపా, కామకేళీ, కామకోటికా, కమదాయినీ
వికార 39 విఘ్నానాశినీ, విజయా, విజ్ఞాత్రీ, విజ్ఞానకలనా, విద్యా
గుణ 03 గుణనిధిః, గుణాతీతా, గుణప్రియా
నికార 60 నిరాకులా, నిరాధారా, నిరాభాధా, నిరామయా
తం 01 తాంబూలపూరితముఖీ
బిందు 03 బిందుతర్పణా, బైందవాసనా, బిందుమండలా,
మహా 42 మహాకామేశనయన, మహాకామేశమహిషీ, మహాకాళీ

ఈ శ్లోకములో ఈ విధముగా 10 శబ్దములతో ప్రారంభమయ్యె నామముల సంఖ్య గూర్చి చెప్పబడినది.  ఇవి ఆ శబ్దముతో ప్రారంభమయ్యె నామముల సంఖ్య, అకారాది నామముల సంఖ్య కాదు.

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *