Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం

/
/
/
438 Views

శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం
శ్రీ శాకంబరీమాత దేవస్థానం, హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు, అమరావతి రోడ్డు, గుంటూరు

మన తెలుగు రాష్ట్రాలలో గల ఏకైక శాకంబరీ దేవాలయము గుంటూరు లోని ఈ శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం.  

ఈ దేవాలయములో మూలవిరాట్ అయిన శ్రీ శాకంబరీమాత తూర్పు ముఖముగా ఉంటారు. సెప్టెంబర్/అక్టోబర్ నెలల మొదలుకొని ఫిబ్రవరి/మార్చ్ నెలల వరకు శ్రీసూర్య భగవానుడు తన అనంత కిరణములతో శ్రీ శాకంబరీమాత మూలవిరాట్టును, శ్రీ శాకాంబరేశ్వస్వామిని మరియు శ్రీ శక్తి పంచాయతనమును అభిషేకిస్తారు. పౌర్ణమినాడు శ్రీచంద్ర భగవానుడు శ్రీ శాకంబరీమాత దేవాలయము అంతటిని తన చల్లని కిరణములతో ప్రసరింపచేస్తారు.

ఆదిపరాశక్తి యొక్క శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) అవతార ముఖ్య ఉద్దేశ్యము

Sri Shakambari Mata Avataram
Sri Shakambari Mata Avataram

పూర్వకాలములో వేదాలను రాక్షసులు సంగ్రహించినప్పుడు, యాగములు, ధర్మ క్రతువులు ఆగిపోయినాయి. వర్షములు లేక కరువు ఏర్పడి, దేవతలు, మునులు, మానవులు, పశుపక్షాదులు క్షీణింపబడ్డాయి. అప్పుడు దేవతలు, మునులు, మానవులు, ఆదిపరాశక్తిని ప్రార్ధించారు. జగన్మాత ప్రత్యక్షమై వీరి మొరవిని జాలిపడి కన్నీరు గార్చింది, ఆ కన్నీరు వర్షముగా, నదులుగా ఏర్పడి ప్రజల కష్టములను తీర్చింది. జగన్మాత వీరందరికీ పాడి పంటలను, ధాన్యములను, కూరలను, పండ్లను, ఆరోగ్యమును మరియు అష్టైశ్వర్యాలను యిచ్చి ఆశ్వీర్వదించింది. అంతేకాకుండా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తనే స్వయముగా నూరుకళ్ళతోటి (అందువలనే జగన్మతకు శతాక్షి అని పేరు వచ్చింది) చూసుకొంటూ కాపాడింది.

శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) అవతార రూపం
నీలివర్ణం, తామర పూవులు వంటి కళ్ళు, ఒక చేతిలో తామర పూవ్వు ధరించి ఉంటుంది – వాటి చుట్టూ తేనటీగలు ఎగురుతూవుంటాయి, రెండొవ చేతిలో విల్లు, బాణములు, మిగిలిన చేతులలో పండ్లు, కూరగాయలు, ధాన్యములు, చెరకులు (మహాప్రకృతి) ఉంటాయి.

Gomata
Gomata

శ్రీ శాకంబరీమాతకు (శ్రీ శతాక్షి మాత) అతి ఇష్టమైనవి

 • గోవులకు పచ్చగడ్డీ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారముగా ఇవ్వడం
 • అన్నార్తులకు, బీదలకు, ముసలివారికి, రోగులకు అన్నదానం, బియ్యం, పప్పులు, కూరలు, పండ్లు, ఔషధాలు ఇచ్చి సహాయం చేయడం.
 • రాక్షస సంహారము చేసి వేదాలను రక్షించి తిరిగి దేవతలు, మునులకు ఇచ్చి యాగాలు, ధర్మక్రతువులు ప్రారంభమయ్యేలా చేసింది కావున ఆమెకు వేద శ్రవణం, వేదాధ్యయనము, వేద పఠనము, వేద విద్యార్థులకు సహాయము చేయుట అన్న ఇష్టము
 • ఇష్టమైన రంగు – ఆకుపచ్చ, మణి  – స్ఫటికం, తిధి – పౌర్ణమి (గృహస్తులందరు చండీ హోమము, శ్రీచక్ర నవావర్ణ అర్చన, శ్రీచక్రమునకు కుంకుమార్చాన చేసిన విశేష ఫలితాలు పొందవచ్చు),  వారము – శుక్రవారము (శ్రీచక్రమునకు కుంకుమార్చాన చేసిన గృహస్తులు అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు పొందగలరు), సేవ – లలితా సహస్రానామములో చెప్పిన వృక్ష జాతులను నాటుట, గోసేవ

శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) పూజావిధానం
సంకల్పము: ఆదిపరాశక్తి స్వరూపమైన శ్రీ శాకంబరీమాతను ప్రతివ్యక్తి (కుల, మత, జాతులకు అతీతముగా) స్వయముగా ప్రేమతో ‘తమ హృదయములో శాశ్వతముగా ఉన్న దివ్య తేజస్సుగా’ తలుచుకొని, మనస్సుతో హృదయములో ఉన్న జగన్మాత రూపమైన తేజస్సుని అనుక్షణం స్మరిస్తూ ఉంటే చాలు. దీనినే ‘నిరంతర స్మరణ’ అంటారు. ఈ పూజ (‘భావనమాత్ర సంతుష్టా  అని లలితా అష్టోత్తరములో చెప్పబడినట్లుగా’)  అత్యంత సులభమైనది మరియు యజ్ఞాలు యాగాలకన్న ఎక్కువ ఫలితములు యిస్తుంది.  ఈ నిరంతర స్మరణ సాధన జగన్మాతకు ఇష్టమైనది, ఎందుకంటే జగన్మాతే యోగశక్తి, మన శరీరంలో, హృదయములో, మనస్సులో ఉన్నది ఆ యోగ శక్తేగా!

శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) నిత్య పారాయణా శ్లోకములు

 1. అనంతఫలసిద్ధిప్రద ఏకశ్లోకీ శ్రీలలితా రహస్య సహస్రనామ పారాయణ (రోజుకి 256 సార్లు పారాయణ )

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా ||

 1. శ్రీలలితారహస్య సహస్రనామ కల్పవృక్షము యొక్క మూల/బీజ శ్లోకములు (ఈ క్రింది రెండు శ్లోకములను కలిపి రోజుకు 36 సార్లు పారాయణ)

దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా ||

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ |
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ||

శ్రీ శాకంబరీ దీక్ష

శ్రీ శాకంబరీ (మండల) దీక్ష నియమాలు
అన్ని దేవతల దీక్షల మాదిరిగానే ఉదయము – సాయంత్రము స్నానము, నిత్యపూజ, ఆహారము, నిద్ర, దైవచింతన ఉంటాయి. ముఖ్యముగా శ్రీశాకంబరీ మండల దీక్షలో భక్తులు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రుట్సు, బెల్లం, పటికిబెల్లం, బియ్యం, గోధుమ, జొన్న, రాగులు, సజ్జలు, పప్పు ధాన్యాలు తీసుకొంటే మంచిది.

శ్రీ శాకంబరీ దీక్షలో చేయవలసిన సేవలు

 1. Sri Shakambari Deeksha
  Sri Shakambari Deeksha

  గోవులకు పచ్చగడ్డీ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారముగా ఇవ్వడం

 2. వేద శ్రవణం, వేదాధ్యయనము మరియు వేద పఠనము
 3. వేదం చదువుకున్నవారికి కూరలు, బియ్యము, పప్పులు దానం చేయటం
 4. వేద విద్యార్థులకు, వేదపాఠశాలలకు సహాయము చేయడం.
 5. అన్నార్తులకు, బీదలకు బియ్యం, పప్పులు, కూరలు, పండ్లు దానం చేయడం.
 6. ముసలివారికి, రోగులకు పండ్లు, కూరలు, పప్పులు, ఔషధాలు దానం చేయటం

శ్రీ శాకంబరీ (మండల) దీక్ష పూర్తి చేయటం
మండల దీక్ష చివరి రోజున, శ్రీ శాకంబరీ మాత ఆలయమునకు వచ్చి కుంకుమతో మరియు కూరగాయాలతో అష్టోత్తర పూజ చేసి దీక్ష విరమించటం.

వివరములకు:
శ్రీ శాకంబరీ సేవట్రస్ట్
℅ శ్రీ శాకంబరీమాత దేవస్థానం, హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు, అమరావతి రోడ్డు, గుంటూరు

అనంతఫలసిద్ధిప్రద ఏకశ్లోకీ శ్రీలలితా రహస్య సహస్రనామ పారాయణ మరియు శ్రీలలితారహస్య సహస్రనామ కల్పవృక్షము యొక్క మూల/బీజ శ్లోకములు
ఆచార్య వేంకట గోపాల కృష్ణ మూర్తి పిశిపాటి, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ పిశిపాటి
“శ్రీవిద్యా” 2-14-132/A 2వ లైను, శ్యామలానగరు, గుంటూరు – 522 006
0863-2235900, 97490 49529, 76750 52266

 • Facebook
 • Twitter
 • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *