శ్రీలంక రామాయణ యాత్ర
ఆసియా ఖండములోని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక అనుభూతి – ఈ శ్రీలంక రామాయణ యాత్ర.
ఈ యాత్రలో త్రేతాయుగములో రామాయణములోని సుందరకాండ మరియు యుద్ధకాండ లోని కొన్ని చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించవచ్చు. రామయణములోని అరణ్యకాండ మరియు కిష్కిందకాండ లోని కొన్ని చారిత్రాత్మిక ఘటనలతో సంభంధము ఉన్న తెలుగువారికి మరిన్ని రామాయణ అనుభూతులని చేరువ చేస్తుంది ఈ శ్రీలంక రామాయణ యాత్ర.
మొదటి రోజు (Day-01) – ట్రింకొమలీలో తిరుకోనేశ్వరం గుడి, శాంకరీ దేవీ శక్తి పీఠచెన్నై/హైదరాబాద్/విశాఖపట్నం నుంచి కొలంబో, శ్రీలంక కు ప్రయాణము. కొలంబో నుంచి ట్రింకొమలీ కు రోడ్డు మార్గమున ప్రయాణము.
అక్కడ మొదటిగా తిరుకోనేశ్వరం గుడికి వెళతాము. రావణాసురుని భక్తికి మెచ్చిన పరమశివుడు, అగస్త్య మహర్షిని రావణునికొరకు ఒక శివాలయము నిర్మించమని ఆజ్ఞాపిస్తారు. భక్తుని కోసము దేవుడు కట్టించిన గుడి ఇది ఒక్కటే.
తరువాత తిరుకోనేశ్వరం గుడిలోని శాంకరీ దేవీ దర్శనము. ఇది అష్టాదశ శక్తి పీఠములలో ఒకటి. పోర్చిగీసువారు ఈ గుడి యొక్క శిఖరమును ఫిరంగిగుండ్లతో ధ్వంసము చేస్తారు. కాని అమ్మవారి విగ్రహం సురక్షితముగానే ఉన్నది.
రాత్రి ట్రింకొమలీలో బస.
రెండోవ రోజు (Day-02) – కన్నియ Hot springs, శ్రీముత్తుమరియమ్మన్ గుడి, మాతలే
ఉదయము టిఫిను చేసి, ట్రింకొమలీలోని కన్నియ Hot springs (వేడి నీటి భావులు) కు వెళతాము. ఇచ్చట రావణాసురుడు తన తల్లి అంత్యక్రియలు కొరకు నీరు లభించక తన త్రిసూలముతో భూమిని ఏడు సార్లు చేధిస్తాడు. దాని ఫలితముగా ఏడు భావులు ఏర్పడి వాటి నుంచి వేడి నీరు ఉద్భవిస్తంది. ఇచ్చట కొంతమంది పితృ దేవతలకు తర్పణములు యిస్తారు. ఈ రోజుకి కూడా అచ్చట నీరు వేడిగా ఉంటుంది.
అచ్చట నుంచి కాలీఅమన్న్ గుడి మరియు లక్ష్మీనారాయణ గుడి దర్శిస్తాము.
మధ్యహ్నము భోజనము చేసికొని రామ్ బోడా కి రోడ్డు మార్గము ద్వారా ప్రయాణం. మార్గమధ్యములో మాతలే లోని శ్రీముత్తుమరియమ్మన్ గుడి మరియు గణపతి గుడిని దర్శిస్తాము.
ఈ శ్రీముత్తుమరియమ్మన్ గుడిలో, మరియమ్మను వర్ష దేవతగాను కొలుస్తారు. అలాగే సంతానము లేనివారు సంతానము కొరకు ప్రార్ధిస్తారు.
రాత్రి రంబోడాలో బస.
మూడోవ రోజు (Day-03) – భక్త హనుమాన్ గుడి, అశోక వనంలో పర్యటన
రాంబోడాలోని భక్త హనుమాన్ గుడి దర్శిస్తాము. సీతాన్వేషణలో హనుమంతుల వారు మొదటిగా తన పాదమును ఈ ప్రదేశములో మోపుట జరిగినది. మహిమ కలిగిన ప్రదేశము అగుట వలన చిన్మయా మిషన్ వారు అచ్చట హనుమాన్ గుడి నిర్మించినారు. తదుపరి గాయత్రీ పీఠము మరియు సీతా మాత గుడి కి వెళతాము. ఈ ప్రదేశములో రావణాసురుడు సీతా మాతను దాచి ఉంచినట్లుగా చెపుతారు. రావణాసురుని చెర నుంచి కాపాడమని సీతా మాత ఈ ప్రదేశములో రోజూ రాములవారిని ప్రార్ధన చేసేవారట.
మధ్యహ్నము భోజనము చేసికొని హక్ గలా బొటనికల్ గార్డెన్ కు వెళతాము.
ఒక్కపుడు ఈ ప్రదేశములోనే అశోక వనము ఉండేదని చెప్తారు. రావణాసురుడు సీతా మాతను దాచి ఉంచిన ప్రదేశము. ఇక్కడ కొన్ని వేల రకాల మొక్కలు, చెట్లు చూడవచ్చు.
రాత్రి రాంబోడా నుంచి ఛిలావ్ కు ప్రయాణము.
నాలుగో రోజు (Day-04)
ఛిలావ్ లో ఉదయము టిఫిను చేసి, అచ్చట మున్నేశ్వరాలయ మరియు మన్వారి గుడి దర్శనము.
రాములవారికి రావణాసురుని చంపుట వలన బ్రహ్మహత్యాదోషము పట్టినది. రాములవారు పుష్పక విమానములో తిరిగి అయోధ్యకు వెళుతుండగా, ఈ మున్నేశ్వరము వద్ద దోషము తగ్గుతుంది. అందువలన బ్రహ్మహత్యాదోషము నివారణ కొరకు అచ్చట శివుని ప్రార్ధన చేస్తారు. అంతట పరమశివుడు ప్రత్యక్షమై, రాములవారిని నాలుగు చోట్ల శివ లింగములు ప్రతిష్ట చేయవలసినదిగా చెప్తారు.
మన్వారి గుడి, ఇది రాములువారు ప్రతిష్ఠించిన మొదటి శివ లింగము. దీనిని రామలింగ శివన్ గుడి అనిపిలుస్తారు.
తరువాత ఇక్కడి నుండి కొలంబోకి ప్రయాణము. మార్గమధ్యములో పంచముఖ అంజనేయర్ గుడి దర్శనము. ఇది శ్రీలంకలోని మొదటి ఆంజనేయస్వామి గుడి. రాత్రి కొలంబో లో బస.
ఉదయము టిఫిను చేసి, చక్కటి జ్ఞాపకాలతొ కొలంబో నుంచి తిరుగు ప్రయాణము.
మరిన్ని వివరాలకు WhatsApp +91 767 505 2266 లేదా ఈ క్రింది లింకను క్లిక్ చేయండి.