Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి – 2

/
/
/
250 Views

శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి, 500 మంత్రముల సంపుటి. నాకెంతో ఇష్టమైన శాక్తేయ ఉపాసన. నిరంతరము పారాయణ చేయటమన్న, హోమము చేయటమన్న నాకు అమితమైన ప్రీతి. బహుశ దానికి కారణము పంచశతిలోని ఈ మంత్రము అయి ఉండవచ్చు.

మయోపదిష్టో బ్రహ్మణే | బ్రహ్మా నారదాయ |
నారదో బృహత్సేనాయ | బృహత్సేనో బృహస్పతయే |
బృహస్పతిరింద్రాయ | ఇంద్రో భారద్వాజాయ |
భరద్వాజో జీవిత్కామేభ్యః  శిష్యేభ్యః ప్రాయచ్చత్ |

ఈ మంత్రము ఆగమ’ శాస్త్రములో ఉన్నట్లుగా వినిఉన్నాను. అంతకు మించి పూర్వపరములు నాకు తెలియవు. కాని ఈ మంత్రం పంచశతి లొ కూర్చబడినది. నాకు తెలిసిన అర్ధం…..

‘మయోపదిష్టో బ్రహ్మణే’…నేను (అనగా కైలాసాచల నాయకుడు శివుడు) ప్రధమముగా ఈ మహావిద్యను బ్రహ్మకు ఉపదేశము చేసినాను. బ్రహ్మ నారదునకు, నారదుడు బృహత్సేనునకు, బృహత్సేనుడు బృహస్పతికి (దేవ గురువు మరియు భారద్వాజుని తండ్రి),  బృహస్పతి ఇంద్రునకు, ఇంద్రుడు భారద్వాజునకు, భరద్వాజుడు తన శిష్యులకు ఉపదేశించినారు.

బహుశా నేను భారద్వాజ గోత్రములో జన్మించుటవలనో, లేక మరే పూర్వజన్మ శుకృతమువలనో  ‘శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి’ అన్న మహాప్రీతి.

పూర్వజన్మ శుకృతము అంటే ఇక్కడ ఒక జ్యోతిష్య పరమైన విషయాన్ని చెప్పి తీరాలి. ‘పులిప్పని జ్యోతిదం’ అను ప్రాచీన తమిళ జ్యోతిష్య గ్రంధములో యిలా చెప్పబడినది.

జాతకములో లగ్నము నుంచి చతుర్థాతిపతి మరియు రాశి నుంచి చతుర్థాతిపతి కలిసి యేభావము నందైనను వుండి, శుక్రుడు మంచి స్థానము నందున్న, ఆ వ్యక్తి దుర్గాదేవి ఉపాసన చేస్తాడు.

ఇదే పూర్వజన్మ శుకృతము అంటే. నా జతకములో లగ్నము నుంచి చతుర్థాతిపతి అయిన ‘సూర్యుడు’, రాశి నుంచి చతుర్థాతిపతి అయిన ‘కుజుడు’ కలిసి పంచమ స్థానములో వుందుట జరిగినది.

ఇక్కడి తో ఆత్మ స్తుతి ఆపి…విషయంలోకి వస్తాను……….

శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి విశేషము ఏమిటనగా ఫలశ్రుతి మంత్రగర్భితమై పారాయణా పాఠానుక్రమమున ఇమిడి వుంటుంది, యదియే కాక యన్నో రహస్యములు ఇమిడి వున్నవి.

ఇదీ రహస్యం ! అలా తెలుసుకోవటం శ్రీవిద్యేగా !!

నాకు తెలిసిన కొన్ని ‘శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి’ విషయాలను వాక్యసుధ ద్వారా మీకు పరిచయము చేస్తాను.

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *