Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

వనదుర్గా మహా విద్యా పారాయణ తరువాత శ్రీసూక్తం జపము చేయాలా?

/
/
/
268 Views

గతములో చెప్పినట్లుగా శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి విశేషము ఏమిటనగా ఫలశ్రుతి మంత్రగర్భితమై పారాయణా పాఠానుక్రమమున ఇమిడి వుంటుంది, యదియే కాక యన్నో రహస్యములు ఇమిడి వున్నవి. అందులో నాకు స్ఫురణకు వచ్చిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.

పంచశతి లోని ఒక మంత్రం…..

పంచమ్యాంచ నవమ్యాంచ పంచదశ్యాం విశేషతః
పఠే దేవం మహావిద్యా శ్రీకామస్సర్వదా జపేత్

2014 గుంటూర్లో మా స్వగృహం నందు వనదుర్గా పంచశతి హోమం చేయుట జరిగినది. ఆ కార్యక్రమములో గురుతుల్యులు శ్రీ యాబులూరి లోకనాథ శర్మ గారు (విజయవాడ) పాల్గొనుట జరిగినది. అది నా అదృష్టం, వారి ద్వారా ఎన్నో వనదుర్గా విద్యలోని రహస్యములు తెలుసుకొనుట జరిగినది.

హోమము చేస్తున్న సందర్భములో ‘పంచమ్యాంచ…..’ అను మంత్రము గూర్చి వివరణ అడిగితే వారు ఇలా శెలవిచ్చారు…

సాధకుడు తనయొక్క ఆధ్యాత్మిక/భౌతిక కామ్య సాధనకు పంచమి తిథి నాడు, నవమి నాడు, పౌర్ణమి లేక అమావాస్య నాడు ‘శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి’ పారాయణ సర్వదా చేయవలెను అని అర్థము.

ఇలాంటి ఎన్నో రహస్యములు లోకనాథ శర్మ గారి ద్వారా తెలుసుకొనుట జరిగినది.

వనదుర్గా మహావిద్య నిరంతర పారాయణ ద్వారా ‘పంచమ్యాంచ…..’ అను మంత్రము గూర్చి నాకు స్ఫురణకు వచ్చిన విషయము చెపుతాను.

ఈ మంత్రానికి ముందు వెనుక లక్ష్మీ మంత్రములతో సంపుటి చేయబడినట్లుగా పారాయణానుక్రమము కూర్చబడినది.

“పంచమ్యాంచ……శ్రీకామస్సర్వదా జపేత్” తరువాతి మంత్రములు….

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్౦ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

శ్రీర్మే భజతు ప్రీత్యావై అ లక్ష్మీర్మే నస్యతు |

లక్ష్మీ, వనదుర్గ యొక్క అంగదేవత. కావున లక్ష్మీ మంత్రములు పంచశతిలో కూర్చబడినవి. “గంధద్వారాం…” శ్రీసూక్తములోని ఒకఅనువాకము. అలాగే శ్రీసూక్తములో “అలక్ష్మీర్నాశయామ్యహం” అని ఒక అనువాకములో వచించబడినది. శ్రీసూక్తములోని ఈ అనువాకము, వనదుర్గా పంచశతి లోని “శ్రీర్మే భజతు ప్రీత్యావై అ లక్ష్మీర్మే నస్యతు” అను మంత్రము యొక్క భావము ఒక్కటే.

దీని ద్వారా నాకు స్ఫురించిన విషయం ఏమిటంటే….అయిదు లేక తొమ్మిది లేక పదిహేను సార్లు వనదుర్గా మహావిద్య పారాయణ చేసిన తరువాత సర్వదా విశేషముగా ‘శ్రీసూక్తము’ పారాయణము చేయవలెను అని.

ఇదీ రహస్యం ! అలా తెలుసుకోవటం శ్రీవిద్యేగా !!

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *